: సర్జికల్ స్ట్రయిక్స్ ను సమర్థించిన పాక్ సింగర్ అద్నాన్ సమీ.. పాక్‌లో ఆయ‌న‌పై మండిపాటు


నియంత్ర‌ణ రేఖ‌ను దాటి భార‌త సైన్యం పీవోకేలో ఉగ్ర‌వాద శిబిరాల‌పై చేసిన దాడిపై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఇటీవలే భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్థాన్ సింగర్ అద్నాన్ సమీ నుంచి కూడా ఈ అంశంపై ప్ర‌శంస‌లు రావ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్లో ఎన్నో పాటలు పాడిన అద్నాన్ సమీ భార‌త్ చేసిన దాడిని స‌మ‌ర్థించారు. భారత్కు మద్దతు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే, ఆయ‌న‌పై పాక్‌లో పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. వాటిపై ఆయ‌న తాజాగా స్పందిస్తూ త‌న‌ వ్యాఖ్యలపై పాక్ ప్ర‌జ‌లు తీవ్రంగా స్పందిస్తున్నార‌ని అన్నారు. వాటినిబ‌ట్టి చూస్తే, పాకిస్థాన్ ను, టెర్రరిజంను రెండింటినీ ఆ దేశ ప్రజలు ఒకటిగానే భావిస్తున్న‌ట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News