: జయలలితకు చికిత్స అందించడం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్న లండన్ వైద్యులు


అనారోగ్యంతో బాధపడుతూ తొమ్మిది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరిన త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించ‌డానికి విదేశీ వైద్యులు కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. లండన్‌కు చెందిన కన్సల్టెంట్‌ ఇంటెన్సివిస్ట్‌ డా.రిచర్డ్‌ జాన్‌ బేలే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రిచర్డ్‌ పర్యవేక్షణలోనే ఆమెకు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ ప‌రీక్ష‌లు కొన‌సాగుతాయ‌ని వైద్యులు తెలిపారు. మ‌రోవైపు ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అపోలో ఆసుప‌త్రికి వెళ్లి ఆమెను పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News