: పాక్ పని పట్టాల్సిందే: పఠాన్‌కోట్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీకాకుళం వీరజవాను


సర్జికల్ దాడులతో కాదు.. యుద్ధం చేసి పాకిస్థాన్ పని పట్టాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీకాకుళం జిల్లా వంగర మండలానికి చెందిన వీర జవాను కనగల శ్రీరాములు అన్నాడు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఉగ్రవాదుల్ని హతమార్చిన సైనిక బృందంలో ఇతను సభ్యుడు. ఆ ఘటనలో గాయపడిన శ్రీరాములు ప్రస్తుతం ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపుదాడి వార్తలను టీవీల్లో చూసిన శ్రీరాములు సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఉపేక్షించకూడదని, పాక్ అంతు చూడాల్సిందేనని అన్నాడు. సర్జికల్ స్ట్రయిక్స్‌తో పాక్‌కు గుణపాఠం నేర్పామని, అయితే ఆ బృందంలో తాను లేనందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News