: మెదక్‌లో భారీ వర్షం.. ఝరాసంగంలో కేతకి సంగమేశ్వర ఆలయంలోకి చేరిన వరద నీరు
మెదక్ జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంఘంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. న్యాల్కల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లోకి వర్షం నీరు చేరుకుంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలుచోట్ల స్తంభాలు విరిగిపడడంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తాము రాత్రంతా చీకట్లోనే గడపాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.