: ధీర వనిత... ఇద్దరు ఉగ్రవాదుల కుత్తుకలు కోసి కూర వండేసింది!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో 12 ఏళ్లుగా పోరాడుతున్న ఓ మహిళ ఇద్దరు తీవ్రవాదుల కుత్తుకలు కోసి కూరవండేసిన ఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇరాకీ మహిళ వాహిదా మొహ్మద్ అల్-జుమైలీ (39) తండ్రి, ముగ్గురు సోదరులు, భర్తతో షిర్కాత్ పట్టణంలో ఆనందంగా జీవిస్తుండేది. ఓ రోజు తమ ప్రాంతంలోకి అడుగుపెట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆమె తండ్రి, ముగ్గురు సోదరులు, భర్తను అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో ఆమె తిరగబడింది. 70 మందితో కలిసి షిర్కాత్ పట్టణంలో సొంత సైన్యాన్ని తయారుచేసుకుంది. దీంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆరుసార్లు ఆమెను హతమార్చే ప్రయత్నం చేశారు. ప్రతిసారి ఆమె వారినుంచి చాకచక్యంగా తప్పించుకుంటూనే ఉంది. కొన్నిసార్లు ఆమె పక్కటెముకలు విరిగినా పోరాటం మాత్రం ఆపలేదు. ఈ క్రమంలో ఐద్దరు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో హోరాహోరీ తలపడిన ఆమె వారి తలలను తెగ్గోసి కూర వండేసింది. మొండాలను కాల్చి పడేసింది. అనంతరం వాటి ముందు నిల్చుని ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆమె తన ఫేస్ బుక్ పేజ్ లో...‘‘నేను వారి నుంచి ఎన్నో బెదిరింపులు, ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. వారి వాంటెడ్ లిస్ట్ లో ప్రధాని పేరు కంటే ముందు నా పేరే ఉంది. వాళ్లు ఆరుసార్లు నన్ను చంపాలని ప్రయత్నించారు. ఈ ఏడాది మొదట్లో నా రెండో భర్తను కూడా చంపేశారు. వారితో యుద్ధం చేశా, వారి తలలను తెగ్గోశా. వాటిని వండేశా. వారి మిగతా శరీరభాగాలను కాల్చేశా’’ అని పేర్కొంది. 2004 నుంచి ఉగ్రవాదులతో పోరాడుతున్న ఆమెకు ప్రభుత్వ దళాల నుంచి కూడా మద్దతు అందుతోంది. వాహిదాకు ఆయుధాలు, వాహనాలు సమకూర్చినట్టు సలాహుద్దీన్ ప్రావిన్స్‌ లోని ఇరాకీ దళాల కమాండర్ జనరల్ జామా అనంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News