: రోడ్ ఐలాండ్‌ రాష్ట్రంలో అడుగుపెట్టిన 'గోదావ‌రి'!


యూఎస్ఏ, రోడ్ ఐలాండ్‌, Sept 30 th 2016(Press Note): రోడ్ ఐలాండ్‌లో ఏర్ప‌డిన‌ మొట్ట‌మొద‌టి సౌత్ ఇండియ‌న్ రెస్టారెంట్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న గోదావ‌రి, అనువైన చోట కొలువుదీరి భారీ స్థాయిలో ఉన్న భార‌తీయుల‌కు సేవ‌లందించేందుకు సిద్ధంగా వుంది. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ద‌క్షిణ భార‌తీయ ఆహార సేవ‌ల సంస్థ గోదావ‌రి, రోడ్ ఐలాండ్‌లో త‌న రెస్టారెంట్‌ను ఈ వారాంతంలో ప్రారంభించేందుకు స‌ర్వ‌ం సిద్ధం చేసుకుంది. అత్యంత అనువైన‌, కీల‌క ప్రాంతంలో ఏర్పాటైన గోదావ‌రి...సీవీఎస్‌, సిటిజన్స్ బ్యాంక్‌, అమికో వంటి అనేక కార్పొరేట్ సంస్థ‌ల ప్ర‌ధాన కార్యాల‌యాల్లోని భార‌తీయ‌, ఇత‌ర దేశాల ఉద్యోగుల‌కు త‌న ఆతిథ్యం అందించనుంది. ఇటీవ‌లే ప్రారంభించిన 'ప‌టేల్ బ్ర‌ద‌ర్స్' నుంచి కేవ‌లం పది నిమిషాల దూరంలోనే 'గోదావ‌రి' ఉంది. గోదావ‌రి, త‌న రెస్టారెంట్లను పెద్ద ఎత్తున విస్తరించడంతో పాటు నోరూరించే అద్భుత‌మైన వంట‌కాల‌ను విస్తృత శ్రేణిలో అందిస్తూ అతిథుల మ‌న్న‌న‌లు పొందుతోంది. గోదావ‌రి రోడ్ ఐలాండ్ ద్వారా మ‌సాచుసెట్స్‌తో పాటు నార్త్ అటెల్‌బ‌రో, రెంథమ్‌, నార్‌వుడ్‌, బెల్లింగ్ హ‌మ్‌ వంటి ప్రాంతాల వారితో పాటు మిగ‌తా ప్రాంతాల్లో చ‌క్క‌టి ద‌క్షిణ భార‌త‌దేశ భోజ‌నం, ఆత్మీయ‌ భార‌తీయ ఆతిథ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి అనువైన వేదిక‌గా నిలువ‌నుంది. గోదావరి త‌న ద‌క్షిణ భార‌త‌దేశ బ‌ఫెట్ రుచుల‌ను అతిథులు కోరిన మేర‌కు వినూత్న‌మైన పేర్ల‌తో అల‌రిస్తోంది. ఈ వారాంతంలో ప్రారంభం కానున్న సందర్భంగా గోదావరి రోడ్ ఐలాండ్‌లో ప్ర‌త్యేకమైన భారీ లంచ్ బ‌ఫెట్‌ను ఏర్పాటుచేశారు. ప్రతివారాంతంలో "గోదావ‌రిలో మీ ఇష్టం" అనే టాలీవుడ్ థీమ్‌తో కొంగొత్త రుచులను అందించనున్నారు. "జీడిప‌ప్పు బ‌జ్జి", "పెస‌ర పునుగులు", "ర‌త్త‌మ్మ‌గారి రాగి ఇడ్లి", "కుంబ‌ర్ లాండ్ కుందేలు వేపుడు", "క‌రివేపాకు కోడి క‌బాబ్‌", "గోదావ‌రి రొయ్య‌లు& మాంసం ప‌లావ్" వంటి ఎన్నో రుచులు అందించ‌నున్నారు. గోదావ‌రి రోడ్ ఐలాండ్‌లో "క‌ల్లు కంపౌండ్" పేరుతో ఫుల్ హౌజ్ బార్‌ను ఏర్పాటుచేసి అనేక డ్రింక్‌ల‌ను అందిస్తున్నారు. "రాజ‌మండ్రి ఐస్‌డ్ టీ", "రాయ‌ల‌సీమ కారం మార్టిని", "సిల్క్ స్మిత స్మూత్ రైతా" తోపాటు ఏ ఇత‌ర భార‌తీయ రెస్టారెంట్లో దొర‌క‌ని మ‌రెన్నో సుర‌పానీయాలు అందుబాటులో ఉన్నాయి. టీమ్ గోదావ‌రిలో భాగ‌స్వామ్యం అవుతున్న సంద‌ర్భంగా అనిల్ దిండి, రాకేష్ వ‌లివేటి, తేజా రావెళ్ల త‌మ సంతోషం, ఉత్సాహం వ్య‌క్తం చేశారు. నిజ‌మైన‌ రుచుల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినూత్నంగా విస్త‌రిస్తున్న టీమ్ గోదావ‌రిలో పాలుపంచుకోవ‌డం ప‌ట్ల ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అనిల్ దిండి, రాకేష్ వ‌లివేటి, తేజా రావెళ్ల మాట్లాడుతూ... "రోడ్ ఐలాండ్ వాసుల‌కు నిజ‌మైన భార‌తీయ రుచుల‌ను విభిన్నంగా అందించడంలో మేం భాగ‌స్వామ్యం అవ‌డం ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. గోదావ‌రి కుటుంబంలో భాగ‌స్వామ్యం ద‌క్క‌డాన్ని మేం స‌గ‌ర్వంగా భావిస్తూ ఈ బ్రాండ్‌కు మ‌రింత వ‌న్నె తెచ్చే విధంగా సేవ‌లు అందిస్తాం" అని తెలిపారు. గోదావ‌రి హాట్‌ఫోర్డ్ ఫ్రాంచైజీ య‌జ‌మాని తేజా రావెళ్ల మాట్లాడుతూ, హాట్‌ఫోర్డ్ వాసులు గోదావ‌రి హాట్‌ఫొర్డ్ ను విజ‌య‌వంతం చేయ‌డం ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారి హృద‌యాల్లో గోదావ‌రిని నిలుపుకున్నార‌ని ప్ర‌శంసించారు. ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రిగిన‌ గోదావ‌రి హాట్‌ఫోర్డ్ ప్రారంభం వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=V0ccOb_5DXE గోదావ‌రి త్వ‌ర‌లో చార్లట్‌- నార్త్ క‌రోలినా, హెన్‌డాన్‌-వ‌ర్జీనియా, ఫార్మింగ్‌హం- మ‌సాచుసెట్స్‌, లాస్ వెగాస్ తో పాటు హాలీవుడ్‌లోను ఏర్పాటు కానుంది. ఈ వారాంతంలో మీ సంతృప్తిక‌ర‌మైన భోజ‌నం, నాణ్య‌మైన రుచుల‌ను గోదావ‌రి రోడ్ ఐలాండ్‌లో ఆర‌గించండి… గోదావ‌రి రోడ్ ఐలాండ్‌ 356 MENDON ROAD, CUMBERLAND, RI 02864. ఫోన్‌: 401-727- 0036 మీరంతా గోదావ‌రి రోడ్ ఐలాండ్ రుచులు ఆస్వాదిస్తార‌ని ఆశిస్తూ.... మ‌రోమారు ధ‌న్య‌వాదాలు. సంప్ర‌దించండి తేజా రావెళ్ల‌ 475-441- 1179 RI@GodavariUS.com www.GodavariUS.com Press note released by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News