: ఈ దాడులు ముందే చేయాల్సింది: అమరజవాన్ భార్య


పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పై భారత్ చేసిన నిర్దేశిత దాడులపై అమరజవాన్ లాన్స్ నాయక్ హేమ్ రాజ్ భార్య ధర్మావతి స్పందించారు. ఈ దాడులు కొన్ని రోజులు ముందే నిర్వహించి ఉంటే కనుక, మన సైనికులు 19 మంది ప్రాణాలు నిలిచేవని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, భారత సైన్యం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల్లో నమ్మకాన్ని కల్పించిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను ఉపేక్షించవద్దని ధర్మావతి కోరారు. కాగా, 2013 జనవరి 8న పూంఛ్ సెక్టార్ వద్ద హేమ్ రాజ్ ను పాక్ సైన్యం అతి కిరాతకంగా చంపివేసింది. శరీరం నుంచి అతని తలను వేరు చేసి దుర్మార్గానికి ఒడిగట్టింది.

  • Loading...

More Telugu News