: పాకిస్థాన్ నటులు కనపడితే దాడులు తప్పవు: మహారాష్ట్ర నవనిర్మాణ సేన


భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ నటులను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో సంచలన ప్రకటన చేసింది. పాకిస్థానీ నటులు ఇక్కడ కనపడితే దాడులు చేస్తామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్ మాట్లాడుతూ, పాకిస్తానీ నటులతో తీస్తున్న సినిమా నిర్మాణాలను అడ్డుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని, టూరిస్ట్ వీసాపై మాత్రమే భారత్ కు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని అన్నారు. ఇది చట్ట వ్యతిరేకమని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అమేయ్ ఖోపర్ అన్నారు.

  • Loading...

More Telugu News