: మా సైన్యం సిద్ధంగా ఉంది.. దీటుగా ఎదుర్కొంటాం: పాకిస్థాన్ ప్రధాని
భారత్ ను దీటుగా ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత్ జరిపిన నిర్దేశిత దాడులపై చర్చించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భారత్ ను దీటుగా ఎదుర్కోవాలని పాకిస్థాన్ కేబినేట్ నిర్ణయించింది. కాశ్మీర్ లో భారత్ అరాచకాలకు పాల్పడుతోందని, భారత్ కు దౌత్యపరంగానూ, భౌతికంగానూ సరైన సమాధానం చెబుతామని నవాజ్ షరీఫ్, భారత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఆరోపించారు.