: అన్ని పనులు ప్రభుత్వమే చేస్తుందని వదిలివేయడం సరికాదు: వెంకయ్యనాయుడు
అన్ని పనులు ప్రభుత్వం చేస్తుందిలే అని వదిలివేయడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పారిశుద్ధ్య సమ్మేళంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ అందరి కార్యక్రమమని, పరిపాలనా నైపుణ్యాలు లేకపోతే లక్ష్యాలు సాధించలేమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదట తాగునీటికి, ఆ తర్వాత పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని వెంకయ్యనాయుడు వెల్లడించారు. కాగా, స్వచ్ఛ భారత్ విశేష సేవలందించిన ఎన్ సీసీ కి ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వచ్ఛతాపురస్కారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని ఎన్ సీసీ తరపున మేజర్ జనరల్ అందుకున్నారు. చెత్త నిర్వహణలో పుణె పట్టణానికి స్వచ్ఛతా పురస్కారం లభించింది.‘స్వచ్ఛభారత్’ లో భాగంగా సేవలందించిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు.