: పాకిస్తాన్ లోనూ ప్రధాని స్వచ్ఛభారత్ అంటూ సెహ్వాగ్ ప్రశంస


ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ లోనూ స్వచ్ఛ భారత్ నిర్వహించారంటూ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించారు. ఉరీలో భారత ఆర్మీ శిబిరంపై పాక్ ఉగ్రవాదుల దొంగదెబ్బ నేపథ్యంలో... భారత ఆర్మీ బుధవారం రాత్రి పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత సెహ్వాగ్ స్పందిస్తూ ‘ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. వారు చాలా చక్కగా ఆడారు. జై హింద్’ అంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే. తాజాగా దానికి కొనసాగింపుగా ప్రధాని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సరిహద్దులు దాటించి పొరుగుదేశంలోనూ మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానించారు. సైనిక దాడులు ఇందులో భాగమేనన్నారు.

  • Loading...

More Telugu News