: రామ్ ఆన్ స్క్రీన్ లో హైపర్ గా ఉంటాడు... ఆఫ్ స్క్రీన్ లో వెరీ కామ్: రాశీ ఖన్నా
కథానాయకుడు రామ్ ఆన్ స్క్రీన్ లో 'హైపర్' గా ఉంటాడని రాశీ ఖన్నా తెలిపింది. 'హైపర్' సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, రామ్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం వెరీ కామ్ గా ఉంటాడని చెప్పింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు 'భానుమతి' అని, రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే పాత్ర తనది అని తెలిపింది. అమాయకమైన యువతి నుంచి గడుసు అమ్మాయిగా మారే విధానం బాగుంటుందని చెప్పింది. తెలుగు సినీ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పింది. రామ్ తో డాన్స్ చేయడం కాస్త కష్టమని, అయితే తాను ఎలాగో మేనేజ్ చేసేశానని రాశీ ఖన్నా చెప్పింది. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.