: అక్రమ నిర్మాణాల కూల్చివేతలో జీహెచ్ఎంసీ దూకుడుకు హైకోర్టు బ్రేక్
హైదరాబాద్ నగరంలోని నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతను వేగవంతం చేసిన జీహెచ్ఎంసీ దూకుడుకు హైకోర్టు ఈరోజు బ్రేక్ వేసింది. నాలుగోరోజూ కూల్చివేతలను కొనసాగిస్తోన్న అధికారులు ఈరోజు 80కి పైగా అక్రమ నిర్మాణాలను తొలగించారు. అయితే, తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ గా వారి పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు వారి వాదనలు విని, నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తొలగించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో వచ్చే నెల 13న మళ్లీ విచారణ జరపనున్నట్లు తెలిపింది.