: కావేరి జల వివాదం: ఉమాభారతితో ముగిసిన సమావేశం
కావేరీ జలాల అంశంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో కర్ణాటక సర్కారుకి షాక్‌ల మీద షాక్‌లు ఎదురైన నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం జయలలితల మధ్య కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆమెకు బదులుగా తమిళనాడు నుంచి ఓ మంత్రి చర్చల్లో పాల్గొన్నారు. కాగా, చర్చలు ఫలితాలను ఇవ్వలేదు. ఎటువంటి పురోగతి లేకుండానే భేటీ ముగిసినట్లు తెలుస్తోంది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఉమాభారతి ఇరు రాష్ట్రాలకు సలహా ఇచ్చారు.