: సరైన జీవన శైలి తో ‘గుండె’ను కాపాడుకోండి: సినీనటుడు అలీ


ప్రతి ఒక్కరూ సరైన జీవన శైలిని అలవరచుకోవడం ద్వారా గుండెను కాపాడుకుని తద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ సినీ నటుడు అలీ సూచించారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించిన 5కె రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో పలువురు చెడు వ్యసనాలకు, పని ఒత్తిడికి గురై గుండె జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. ప్రజలు నడకకు దూరమై, వాహనాలకు దగ్గరవుతున్నందు వల్ల కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారని అలీ అన్నారు.

  • Loading...

More Telugu News