: శ్రీకాకుళం బందరువాని పేట సముద్రతీరంలో పడవ బోల్తా.. ఇద్దరు మత్స్యకారుల మృతి
శ్రీకాకుళంలోని గార మండలం బందరువాని పేట సముద్రతీరంలో ఈరోజు ప్రమాదం జరిగింది. పడవలో చేపల వేటకు వెళ్లి, పని ముగించుకున్న అనంతరం మత్స్యకారులు తిరిగి తీరానికి వస్తోన్న సమయంలో వారు ప్రయాణిస్తోన్న పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. మృతులు శివకోటి కూర్మనాథ స్వామి(23), శివకోటి ముని(55)గా అధికారులు గుర్తించారు. తెల్లవారు జామున ఆరుగురు మత్స్యకారులు పడవలో చేపల వేటకు వెళ్లారని చెప్పారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు.