: బీజేపీ ఎమ్మెల్యే కళ్లల్లో కారం కొట్టిన కేసులో మహిళ అరెస్టు


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో బీజేపీ ఎమ్మెల్యే కపిల్ దేవ్ అగర్వాల్ కళ్లలో కారం కొట్టిన కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కపిల్ దేవ్ అగర్వాల్ తన కార్యాలయంలో స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతుండగా, ముగ్గురు యువకులు ప్రదీప్, కపిల్, విక్రాంత్ లు ఆయనపై కారంతో దాడి చేశారు. అయితే, ఎమ్మెల్యే అంగరక్షకులు వెంటనే స్పందించి కాల్పులు జరపడంతో ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసులో విక్రాంత్ తల్లి గీతకు సంబంధమున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ముగ్గురు పరారీలోనే ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

  • Loading...

More Telugu News