: షేక్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న ఎమ్మెల్యే
హైదరాబాద్‌లో వరుసగా నాలుగోరోజు నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ సిబ్బందిపాటు అధికారులు కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో అక్రమనిర్మాణాలను కూల్చి వేసిన అధికారులు అదే జోరుతో ఈరోజు మరిన్ని నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో ఈరోజు షేక్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి బృందావన్ కాలనీ అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన ఎంఐఎం నేత, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ సిబ్బందిని అడ్డుకున్నారు. అక్కడి నిర్మాణాలను కూల్చివేయొద్దని వాగ్వివాదానికి దిగారు.