: ఢిల్లీ సీఎం ట్వీట్ పై మండిపాటు.. అసభ్య పదజాలంతో కేజ్రీవాల్‌ను తిడుతూ ట్విట్టర్ లో రీట్వీట్లు


సోషల్ మీడియా వేదికగా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల దాడి చేయ‌డంలో ముందుండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ట్విట్ట‌ర్ యూజ‌ర్లు చేసిన రీట్వీట్ల‌తో కంగుతిన్నారు. ఇటీవ‌ల చోటుచేసుకున్న యూరీ ఉగ్రదాడిపై కేజ్రీ తాజాగా చేసిన ట్వీట్‌పై ఆయన ఫాలోవ‌ర్లు తీవ్రంగా మండిప‌డ్డారు. ఇటీవలి యూరీ దాడిపై ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఓ పత్రికలో వచ్చిన ఆర్టిక‌ల్‌ని ఉటంకిస్తూ ఆ మీడియా అద్భుతమైన కథనాన్ని ప్ర‌చురించింద‌ని పేర్కొన్నారు. యూరీ దాడి విషయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కాకుండా ఇండియానే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోందంటూ ఆయన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దీంతో మండిపోయిన ట్విట్టర్ యూజ‌ర్లు సార్క్ సదస్సుకు ప్ర‌ధాని మోదీ హాజ‌రుకాక‌పోతే.. ఆయనకు బదులుగా కేజ్రీవాల్‌ని పాకిస్థాన్ ఆహ్వానించ‌వ‌చ్చు అని రీట్వీట్ చేశారు. మ‌రొక‌రు కేజ్రీవాల్‌కు అస‌లు బుర్ర ఉందా? అని ప్ర‌శ్నించారు. ఢిల్లీ సీఎంకి సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరు? అని విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి కొంత‌మంది అసభ్య పదజాలంతో కేజ్రీవాల్‌ను తిడుతూ రీట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News