: పొరుగింటి అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియో చిత్రీకరణ.. ఆపై బ్లాక్‌మెయిలింగ్.. యువకుడి అరెస్ట్
పొరుగింటి అమ్మాయికి మత్తుమందు ఇచ్చి ఆపై అశ్లీల వీడియో తీసిన ప్రబుద్ధుడిని ఢిల్లీ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వారి కథనం ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన యువతి(19) ప్రవేష్ కుటుంబం పక్కింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ప్రవేష్తో యువతికి పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఇంటికొచ్చిన యవతికి ప్రవేష్ జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన వెంటనే ఆమె మత్తులోకి జారుకుంది. దీన్ని అదునుగా తీసుకున్న ప్రవేష్ యువతి నగ్న చిత్రాలను వీడియోలో చిత్రీకరించాడు. అమ్మాయికి మెలకువ రాగానే వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటి నుంచి నగలు, డబ్బు తీసుకుని వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే అశ్లీల వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి ప్రవేష్కు కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. అయినా యువకుడు బ్లాక్‌మెయిలింగ్ ఆపకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. ప్రవేష్ అకృత్యాలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవేష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి అశ్లీల చిత్రాల వీడియోలను స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి పంపారు.