: కశ్మీర్‌కు స్వాతంత్ర్యం వస్తే భారత్ ముక్కలేనన్న పాక్.. కశ్మీర్ అంశంలో పాక్ వైఖరికే జై కొడతామన్న చైనా
కశ్మీర్‌కు స్వాంతంత్ర్యం వచ్చిన మరుక్షణం భారత్ ముక్కలవడం ఖాయమని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ అన్నారు. కశ్మీరీలు సాగిస్తున్న స్వతంత్ర పోరాటం విజయం సాధిస్తే కనుక అది భారత్ ముక్కలు కావడానికి నాంది అవుతుందని అన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం కృషి చేస్తుంటే భారత్ వైపు నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని ఆరోపించారు. మరోవైపు కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ వాదనకే తాము మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ ఝెన్‌మిన్ తెలిపారు. కశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందని, కాబట్టి ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా కోరుకుంటోందని ఆయన అన్నారు.