: పాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘన
భారత్ పై పాకిస్థాన్ దుశ్చర్యలను పలు దేశాలు ఎండగడుతున్న సమయంలో ‘పాక్’ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ పూంఛ్ సెక్టార్ లో కాల్పులకు తెగబడింది. సాజియాన్ ప్రాంతంలో భారత ఔట్ పోస్ట్ లు లక్ష్యంగా ఈ కాల్పులకు పాల్పడుతోంది. భారత బలగాలు కూడా దీటుగానే సమాధానం చెబుతున్నాయి.