: ‘స్వర్ణం’ సాధించిన భారత మహిళల కబడ్డీ జట్టు
ఐదవ ఏసియన్ బీచ్ గేమ్స్ -2016లో భారత మహిళ కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. వియత్నాంలోని దనాంగ్ పట్టణంలో జరిగిన బీచ్ కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో థాయ్ లాండ్ పై తలపడ్డ భారత్ 41-31 తేడాతో విజయం సాధించింది. కాగా, మహిళల బీచ్ కబడ్డీకి సంబంధించి ఫైనల్ వరకు వచ్చి భారత్ చేతిలో థాయ్ లాండ్ ఓడిపోవడం వరుసగా ఇది ఐదోసారి. ఇక, భారత పురుషుల కబడ్డీ జట్టు మాత్రం ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. కేవలం రెండు పాయింట్ల తేడాతో, 28-30 స్కోరుతో భారత్ ఓటమి పాలైంది. 2008, 2010 ఆసియన్ బీచ్ గేమ్స్ లో భారత పురుషుల కబడ్డీ జట్టు బంగారు పతకాలు సాధించింది.