: ‘హిందూస్థాన్ కేబుల్స్’ మూసివేతకు గ్రీన్ సిగ్నల్
కోల్ కతాలోని హిందూస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఇందుకు అంగీకారం తెలిపింది. 2007 పే స్కేల్ ప్రకారం ఈ సంస్థలోని ఉద్యోగులకు ఆకర్షణీయమైన వీఆర్ఎస్, వీఎస్ఎస్ పథకాలను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనాల చెల్లింపు, వీఆర్ఎస్ కు, ప్రభుత్వ రుణాన్ని వాటా రూపంలో మార్చడానికి రూ.4,777.05 కోట్ల ప్యాకేజీ ని కేటాయించారు.