: గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు
ఈరోజు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలుసుకున్న ఉద్యోగులు తమ గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తాము కలిసిమెలసి పనిచేశామని, ఇప్పుడు దూరంగా ఉన్నందుకు బాధగా ఉందని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాము ఎక్కడున్నా తమతో కలిసి పనిచేసిన ఉద్యోగుల క్షేమాన్ని కోరుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.