: పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి: 'యూఎన్'కు బంగ్లాదేశ్ వినతి


పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా భారత్ లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మౌజెమ్ అలీ మాట్లాడుతూ, సార్క్ సమావేశాలకు హాజరుకామని నాలుగు దేశాలు నిరాకరించడం చాలా తీవ్రమైన అంశమని, ఈ విషయాన్ని గుర్తించాలని యూఎన్ఓను కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఏకాకిని చేయాలని అన్నారు. భవిష్యత్తులో విదేశీ పాలసీల అంశంలో పాకిస్థాన్ ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుందో అది దాని ఇష్టమని అన్నారు. కాగా, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నవంబర్ లో జరగనున్న సార్క్ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకారని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఇదే నిర్ణయాన్ని బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గానిస్థాన్ దేశాలు కూడా ప్రకటించాయి. సార్క్ లో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ సభ్యదేశాలు.

  • Loading...

More Telugu News