: జైసల్మేర్ సమీపంలో భారీగా మోహరించిన పాక్ సైన్యం, ఎయిర్ ఫోర్స్


యూరీ ఉగ్రదాడుల తరువాత తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం, వాయుసేన దళాలు అతిపెద్ద సంయుక్త యుద్ధ విన్యాసాలను జైసల్మేర్ కు 15 కిలోమీటర్ల దూరంలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ప్రదర్శిస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఈ నెల 22 నుంచి వీరి విన్యాసాలు ప్రారంభమైనా, ఇప్పుడు భారీగా మోహరించిన సైన్యం మరిన్ని విన్యాసాలు చేస్తోందని, మొత్తం 15 వేల మంది జవాన్లు, 300 మందికి పైగా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు విన్యాసాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. చాలా మంది పాక్ సైనికాధికారులు ఈ ఆర్మీ ఎక్సర్ సైజ్ ను తిలకించేందుకు వచ్చారని సమాచారం. కరాచీకి చెందిన ఐదు దళాలు, ముల్తాన్ కు చెందిన 2 దళాలతో పాటు 205 బ్రిగేడ్ ఈ వార్ గేమ్స్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఎడారిని సైతం వదలకుండా యుద్ధపు ఆటలు ఆడుతోంది. పాక్ చర్యలతో సరిహద్దు భద్రతా దళం సైతం అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News