: ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు
అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు వద్ద ఈరోజు కలకలం చెలరేగింది. కోర్టు ఆవరణలో దుండగులు బాంబు పెట్టినట్లు పోలీసులకి బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న బాంబు తనిఖీ బృందం నాయస్థాన ఆవరణ అంతా తనిఖీ చేసి బాంబులేదని చెప్పింది. దీంతో ఇది ఆకతాయిల పనేనని పోలీసులు నిర్ధారించారు.