: అణ్వాయుధాల రక్షణ విషయంలో భారత్‌ను కొనియాడిన అమెరికా రక్షణశాఖ కార్యదర్శి


‘అణ్వాయుధ నియంత్రణ’ అనే అంశంపై ఉత్తర డకోటాలోని మినోట్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో అమెరికా రక్షణశాఖ కార్యదర్శి ఆష్టన్‌ కార్టర్ ప్ర‌సంగిస్తూ అణ్వాయుధాల విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానాన్ని కొనియాడారు. భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. మ‌రోవైపు పాకిస్థాన్ ఈ విష‌యంలో పూర్తిగా సమస్యల్లో చిక్కుకున్నట్లు తాము భావిస్తున్న‌ట్లు తెలిపారు. త‌మ దేశం అణ్వాయుధాల సంఖ్య‌ను అధికం చేసుకునేందుకు ఆసక్తి క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఇతర దేశాలు మాత్రం అధిక సంఖ్య‌లో పెంచుకుంటున్నాయని అన్నారు. భార‌త్‌తో పాటు చైనా కూడా ఈ విషయంలో చాలా ప్రొఫెషనల్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. చైనా దేశ‌ ఆయుధ సంపత్తి అధికమ‌వుతోంద‌ని పేర్కొన్నారు. రష్యా గురించి ప్ర‌స్తావిస్తూ ఆ దేశం సరికొత్త అణ్వాయుధాలను త‌యారు చేసింద‌ని తెలిపారు. పాకిస్థాన్‌లో ఉన్న‌ అణ్వాయుధాలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయని ఆష్టన్‌ కార్టర్ చెప్పారు. అణ్వాయుధాల భద్రతపై త‌మ దేశం ఆ దేశంతో కలిసి పనిచేస్తోంద‌ని పేర్కొన్నారు. త‌మ దేశం 25 ఏళ్ల నుంచి నూత‌నంగా అణ్వాయుధాల తయారీ జోలికి వెళ్ల‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. మిగ‌తా అన్ని దేశాలు మాత్రం వాటిని త‌యారుచేస్తూనే ఉన్నాయ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News