: బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి కష్టాలు... విచారించేందుకు ఢిల్లీ పోలీసులకు అనుమతి


నిత్యమూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కష్టాల్లో పడ్డారు. ఐదేళ్ల నాడు ముంబైకి చెందిన ఓ పత్రికలో ఆయన రాసిన వ్యాసంపై నేషనల్ మైనారిటీ కమిషన్ కేసు దాఖలు చేయగా, దానిపై ఆయన్ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులకు అనుమతి లభించింది. దేశంలోని ముస్లింలకు ఓటు హక్కును తొలగించాలని అప్పట్లో ఆయన రాశారు. దీనిపై సెక్షన్ 153-ఏ కింద కేసు నమోదు కాగా, విచారణ మాత్రం జరగలేదు. ఇప్పుడిక ఇదే కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రాగా, జస్టిస్ ఐఎస్ మెహతా వాదనలు విన్నారు. ముసాయిదా చార్జ్ షీట్ తయారైందని పోలీసులు చెప్పడంతో, స్వామిని విచారించేందుకు అనుమతించారు. ఇదే కేసులో ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చాలని స్వామి కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News