: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం కాల్వలపల్లి వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని గాయాలపాలయిన వారికి దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.