: ప్రముఖ దర్శకనిర్మాత తిరువీధి గోపాలకృష్ణ కన్నుమూత


ప్రముఖ దర్శకనిర్మాత తిరువీధి గోపాలకృష్ణ కన్నుమూశారు. హైదరాబాదు ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేరోజు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. గోపాలకృష్ణ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమారుడు కొంతకాలం క్రితం మృతి చెందారు. రెండో కుమారుడు సినీ పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. మురళీమోహన్ హీరోగా నటించిన ‘వస్తాడే మా బావ’, శివాజీ రాజా నటించిన ‘అహో బ్రహ్మ, ఓహో శిష్య’ తదితర సినిమాలకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. పది సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సారథి స్టూడియోలో తొలినాళ్లలో సినిమాలు నిర్మించిన వారిలో గోపాలకృష్ణ ఒకరు. ఫిలింనగర్ సొసైటీ ఏర్పాటుకు కృషి చేసిన ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు.

  • Loading...

More Telugu News