: కావేరి జలాల వివాదం.. బెంగళూరులో 144 సెక్షన్
కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో బెంగళూరులో మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ ను విధించారు. ఈ ఆదేశాలు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి వరకూ అమల్లో వుంటాయి. కాగా, రోజుకి 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలన్నది సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు. 28, 29 తేదీల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా రిజర్వాయర్లను తెరిచి ఉంచాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.