: శ్రీనగర్ లో మళ్లీ పంజా విసిరిన ఉగ్రవాదులు
యూరీ సెక్టార్ పై ఉగ్రదాడి సంఘటన మరవక ముందే, శ్రీనగర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. సురాలోని సహస్ర సీమ బల్ (ఎస్ఎస్ బీ) క్యాంపుపై దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ప్రతిదాడులకు దిగింది. ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ యూఎన్ఓ జనరల్ అసెంబ్లీ లో పాక్ తీరును ఎండగట్టిన మర్నాడే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.