: క్రికెట్ నాకు చాలా ఇచ్చింది... నేను క్రికెట్ కు ఇవ్వాల్సిన సమయం వచ్చింది: ఎమ్మెస్కే ప్రసాద్
ఇండియన్ క్రికెట్ తనకు చాలా ఇచ్చిందని, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కు తాను ఇవ్వాల్సిన సమయం వచ్చిందని టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎమ్మెస్కే ప్రసాద్ ను గుర్తించే విధంగా పని చేస్తానని అన్నారు. చీఫ్ సెలెక్టర్ గా నీకు బాధ్యతలు అప్పగిస్తున్నామని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ తనకు ఫోన్ చేసిన క్షణాలు తన జీవితంలో అంత్యంత ఆనందకరమైన క్షణాలని ఆయన చెప్పారు. సౌత్ జోన్, నార్త్ జోన్ కు ఆడుతున్నప్పుడు ధోనీని చూసి... నీకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పానని, అప్పుడే తన కెరీర్ ముగిసిందని చాలా మంది అన్నారని గుర్తుచేసుకున్నారు. ఇంత గొప్ప అవకాశానికి కారణమైన తెలుగు క్రికెట్ అసోసియేషన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.