: సుష్మా స్వరాజ్ చరిత్రను వక్రీకరించారు, అబద్ధాలు చెప్పారు: పాకిస్థాన్
ఐక్యరాజ్యసమితి వేదికగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ ను కడిగేసిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ స్పందించింది. ఆమెను అబద్ధాల పుట్టగా అభివర్ణించింది. ఆమె చరిత్రను వక్రీకరించారని పాకిస్థాన్ ఆరోపించింది. కాశ్మీర్ లో లక్షలాది మంది సైనికులను మోహరించిన భారత్ మానవహక్కులను ఉల్లంఘిస్తోందని పాతపాటే పాడింది. ఆమె పాకిస్థాన్ పై చేసిన ఆరోపణలు నిరాధారాలని తెలిపింది. ఆమె ప్రసంగాన్ని ఖండిస్తున్నామని ప్రకటించింది. పాకిస్థాన్ పై భారత్ పెంచుకున్న పగ, ప్రతీకారాలకు ఆమె ప్రసంగం అద్దం పడుతోందని పాక్ తెలిపింది. అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు పక్కాగా రూపొందించుకున్న ప్రసంగాన్ని ఆమె చదివారని పాక్ ఆరోపించింది. కాగా, ఐక్యరాజ్యసమతిలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలు వెలివేయాలని సూచించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద దేశంపై ప్రపంచం మొత్తం ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బెంబేలెత్తిన పాకిస్థాన్ బిత్తరపోయి ఆమె ప్రసంగాన్ని ఖండించింది.