: ఏపీలో ల్యాండ్ పూలింగ్ సభలు రసాభాస
బందరు పోర్టు, కోస్టల్ కారిడార్ భూముల కోసం కృష్ణా జిల్లాలో నిర్వహించిన ల్యాండ్ పూలింగ్ గ్రామసభలు రసాభాసగా మారాయి. భూ సమీకరణను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. భూసమీకరణను నిరసిస్తూ బుద్దాలపాలెం, మేకవానిపాలెం, కోన, పోలాటి తిప్ప గ్రామ పంచాయతీలు ఈమేరకు మూకుమ్మడి తీర్మానాలు చేశాయి. గ్రామసభల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.