: విమానంలో బాలయ్య డైలాగ్ లు.. ఇదిగో, మీరూ వినండి!


శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రావణాసురుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు... వంటి పౌరాణిక పాత్రలే కాకుండా సాంఘిక చిత్రాల్లోనూ తన అపూర్వ నటనతో ప్రేక్షకులను మైమరపించిన మహానటుడు ఎన్.టి.రామారావు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయుడు నందమూరి బాలకృష్ణ తనదైన నటనతో ప్రేక్షకులను మైమరపిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి నటించిన సినిమాలు, ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లోని పెద్ద పెద్ద డైలాగ్ లను బాలకృష్ణ అవలీలగా చెప్పేస్తుంటారు. చాలా వేదికలపై ఆయన చెప్పడం మనం చూశాం కూడా. తాజాగా, బాలయ్య విమాన ప్రయాణంలో ఉండగా ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ హిట్ ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలోని దుర్యోధనుడి పాత్రలోని డైలాగ్ లను బాలయ్య అలవోకగా పలికించారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన ట్యాబ్ లో ‘దానవీర శూరకర్ణ’ చిత్రం చూస్తున్నాడు. నటుడు బాలకృష్ణ కూడా ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న ఆ అభిమాని వెంటనే బాలకృష్ణ పక్క సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. క్లాసికల్ మూవీస్ అంటే తనకు ఇష్టమని, ఎన్టీఆర్ తన అభిమాన నటుడని బాలకృష్ణ కు చెప్పాడట. ఈ సందర్భంగా ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోని ఒక డైలాగ్ ను చెప్పమంటూ బాలకృష్ణను ఆ అభిమాని కోరగా, బాలయ్య విజృంభించాడు. ఆ ట్యాబ్ ను బాలయ్య తన చేతిలోకి తీసుకుని మరీ, దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను గుక్కతిప్పుకోకుండా చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News