: 600 సంవత్సరాల క్రితం జరిగిన డెత్ మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
దాదాపు 600 సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ మనిషి డెత్ మిస్టరీని శాస్త్రవేత్తలు తాజాగా ఛేదించారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 2014లో కనుగొన్న ఓ అస్థిపంజరంపై సుదీర్ఘంగా పరిశోధనలు జరిపి, దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ అస్థిపంజరం ఓ గిరిజనవాసిదని, పదునైన ఆయుధంతో అతడిని పొడిచి చంపారని తేల్చిచెప్పారు. అతనికి కాకుత్జా అని పేరు పెట్టారు. హత్యకు గురయినప్పుడు ఆ వ్యక్తి వయసు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. ఎత్తు 1.7 మీటర్లు ఉండొచ్చని పేర్కొన్నారు. అప్పట్లో ఆత్మరక్షణ కోసం చెట్ల కొమ్మలతో పదునైన ఆయుధాలును తయారు చేసుకునేవారు. ఆ ఆయుధాలతోనే అతడిని చంపేసినట్లు పేర్కొన్నారు.