: సినిమా ట్రైలర్ చూసి భావోద్వేగానికి గురవుతున్న ధోనీ తండ్రి!


టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఎమ్ఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతిసారి క్రికెటర్ ధోనీ తండ్రి పాన్ సింగ్ భావోద్వేగం చెందుతున్నాడట. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే .. తన కొడుకు పడిన కష్టం, అతని అకుంఠిత దీక్ష, పట్టుదల గుర్తొచ్చి ఆయన కళ్లు చెమర్చుతున్నాయని పాన్ సింగ్ సన్నిహితులు చెబుతున్నారు. కాగా, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News