: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో టాంగాలోనే ప్రసవించిన మహిళ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ గర్భిణీ టాంగాలోనే ప్రసవించిన ఘటన వెలుగుచూసింది. నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని ఆమె బంధువులు జిల్లాలోని మీర్గంజ్ లో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే, గర్భిణీ పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కనబర్చారు. సమయానికి ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో టాంగాలోనే ఉండిపోయిన గర్భిణీకి బంధువులు అందులోనే కాన్పు చేశారు. ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఆసుపత్రి సిబ్బంది చోద్యం చూస్తూఉన్నారే తప్ప స్పందించలేదు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ మహిళను బంధువులు టాంగాలో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.