: సింధు జలాల ఒప్పందంలో భారత్ నిర్ణయంపై పాక్ లో అలజడి..అంతర్జాతీయ కోర్టుకు వెళ్లాలని యోచన
సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ పునఃసమీక్షించడం పట్ల పాకిస్థాన్‌లో అలజడి రేగుతోంది. ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో తేల్చుకుంటామని పాక్ పేర్కొంది. ఈ విషయాన్ని పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మీడియాకు చెప్పారు. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ చట్టం ప్రకారం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అందులోంచి భారత్ ఏకపక్షంగా తప్పుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. గతంలో జరిగిన కార్గిల్, సియాచిన్ యుద్ధాల సమయాల్లోనూ ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉపసంహరించుకోలేదని ఆయన అన్నారు. 'రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు' అని పేర్కొంటూ నిన్న భారత్ పేర్కొన్న విషయం తెలిసిందే. సింధు జలాల ఒప్పందంపై సమీక్ష అనంతరం ప్రధాని నరేంద్రమోదీ సింధు జలాలను న్యాయపరంగా పూర్తిగా వాడుకుంటామని అన్నారు.