: మరో హృదయవిదారక ఘటన.. ఇంటి పైకప్పు కలపతో తల్లి మృతదేహానికి దహనకాండ చేసిన కూతుళ్లు!


మనుషుల్లో మాన‌వ‌త్వం మంట‌గలుస్తోందనడానికి తాజా ఉదాహరణ. ఒడిశాలోని కలహంది జిల్లాకు చెందిన నిరుపేద మ‌హిళలు చనిపోయిన తమ తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి, ఊళ్లోవారు ఎవరూ సాయం అందించకపోవడంతో, తమ ఇంటి పైకప్పును ఊడదీసి ఆ కర్రలతో దహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళితే... అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ కనక్ సప్తతి (75) అనే మహిళ ఇటీవ‌ల మృతి చెందింది. చాలా పేద కుటుంబం కావ‌డంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వ‌హించేందుకు కూడా ఆమె కూతుళ్లకు స్తోమత స‌రిపోలేదు. అంత్య‌క్రియ‌ల‌కు స‌హ‌క‌రించాల్సిందిగా ఊర్లో వారందరిని కోరారు. అయితే, వారికి సాయం చేయ‌డానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో త‌మ‌ ఇంటి పైకప్పున‌కు ఉన్న కలపను తీసేసి దాని ద్వారా దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, త‌మ త‌ల్లి శవాన్ని తీసుకెళ్లేందుకు కూడా గ్రామ‌స్తులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఓ మంచంపై త‌మ త‌ల్లి మృత‌దేహాన్ని ఉంచి వారే మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వ‌హించారు.

  • Loading...

More Telugu News