: నయీమ్‌ అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.. కానీ నేను నయీమ్‌లకే నయీమ్‌ను!: వర్మ


ఇటీవ‌ల పోలీసుల చేతుల్లో హ‌త‌మైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ జీవితం ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌ వర్మ సినిమా తీసే పనిలో ప‌డిన విష‌యం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఓ పాట‌ను కూడా ఆయ‌న విడుద‌ల చేశాడు. అయితే, ఈ అంశంపై తాజాగా వ‌ర్మ స్పందిస్తూ త‌న‌కు నయీమ్‌ అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. అయితే, తాను నయీమ్‌లకే నయీమ్ నని, ఈ విష‌యాన్ని త‌న‌ను బెదిరిస్తున్న వారు తెలుసుకోవాలని ఆయన గట్టిగా చెప్పారు. తాను తీయ‌బోమే సినిమా కోసం ముంబయి జైలులో ఉన్న నయీమ్‌ సన్నిహితుడిని, నయీమ్‌కు సాయం చేసిన ఐదుగురు పోలీసులను క‌లిసిన‌ట్లు వర్మ చెప్పాడు. నయీమ్‌తో కలసి మూడేళ్లు పనిచేసిన ఇద్దరు నక్సలైట్లను కూడా కలిసిన‌ట్లు చెప్పాడు. తాను నయీమ్‌ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. న‌యీమ్‌కి కరాచీకి చెందిన ఓ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తెలిసి షాకైనట్లు తెలిపాడు. నయీమ్‌ తన మరదలి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించాడో కూడా తెలుసుకున్నట్లు వ‌ర్మ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News