: టీవీ9పై కన్నేసిన జీ గ్రూప్.. మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు ప్రయత్నం!
ప్రముఖ టీవీ న్యూస్ చానల్ టీవీ 9పై జీ గ్రూప్ కన్నేసింది. టీవీ 9ను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)లో మెజారిటీ వాటాలు చేజిక్కించుకునేందుకు జీ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏబీసీఎల్‌లో వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు(పీపుల్స్ క్యాపిటల్) ప్రధాన వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఏబీసీఎల్‌ను రూ.850 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. టీవీ 9, జైతెలంగాణ పేరుతో తెలుగులో న్యూస్ చానళ్లు నిర్వహిస్తున్న ఏబీసీఎల్ కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లిష్ తదితర మొత్తం ఏడు చానళ్లను నిర్వహిస్తోంది. గతంలోనూ ఏబీసీఎల్‌ను కొనుగోలు చేసేందుకు పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినా సరైన డీల్ కుదరలేదు. తాజాగా జీ గ్రూప్ టీవీ 9పై కన్నేసినట్లు తెలుస్తోంది.