: నయీం అనుచరులతో కలిసి భూమి కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే.. కేసీఆర్‌కు లేఖరాసిన బాధితురాలు


నయీం గ్యాంగుతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారని పేర్కొంటూ విజయలక్ష్మి అనే మహిళ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాజకీయ నాయకులు, రౌడీలు, అధికారులు కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని లేఖలో పేర్కొన్నారు. భూమికి సంబంధించిన అన్ని ఆధారాలను లేఖకు జతచేశారు. నయీం గ్యాంగు సభ్యులైన మహ్మద్ కైసర్, మహ్మద్ కరీం, మహ్మద్ అబ్దుల్ హమీద్, తాజొద్దీన్ ఖాన్ తదితరులు జిల్లెల గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని తన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తెలిపారు. గతంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మీరైనా న్యాయం చేయాలంటూ లేఖలో సీఎంను కోరారు.

  • Loading...

More Telugu News