: పాము కలకలంతో అర్థాంతరంగా నిలిచిపోయిన బుల్లెట్ ట్రైన్
జపాన్ లోని బుల్లెట్ ట్రెయిన్ లో ఒక పాము కలకలం సృష్టించింది. సీట్ల మధ్య పాము ఉండటాన్ని గుర్తించిన ఒక ప్రయాణికుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో, రైల్ ను అర్థాంతరంగా నిలిపివేశారు. దేశ రాజధాని టోక్యో నుంచి హిరోషిమాకు ఈరోజు బయలుదేరిన బుల్లెట్ ట్రైన్ (నోజోమీ 103)లోని సీట్ల మధ్యలో గోధుమ రంగులో ఉన్న పాము ఉంది. ప్రయాణికుడి సమాచారంతో జపాన్ రైల్వే శాఖ అధికారులు రైలుని ఆపివేసి, పాముని పట్టుకున్నారు. అనంతరం, రైలు బయలుదేరి వెళ్లిందని, సరైన సమయానికే రైలు హిరోషిమా చేరుకుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.