: ఏపీలో మూడు ఎయిర్ పోర్టులకు పూర్తి అనుమతులు, తెలంగాణలో ఒక నూతన విమానాశ్రయానికి అంగీకారం


ఏపీలో ఇప్పటికే ప్రాథమిక అనుమతులు పొందిన కర్నూలు, భోగాపురం, నెల్లూరు విమానాశ్రయాలకు పూర్తి స్థాయి అనుమతులు ఇస్తూ, పౌరవిమానయాన శాఖ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో ఒక విమానాశ్రయానికి ప్రాథమిక అనుమతి లభించింది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం భూసేకరణ దశలో ఉండగా, నెల్లూరు, కర్నూలు ఎయిర్ పోర్టులకు భూమిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఉదయం సమావేశమైన కమిటీ, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో విమానాలు దింపేందుకు అవసరమయ్యే అనుమతులు ఇస్తున్నట్టు తెలిపింది. భోగాపురం, కర్నూలు, నెల్లూరు ఎయిర్ పోర్టులకు పూర్తి అనుమతులు రావడంతో ఇక ఎంత వేగంగా నిర్మాణాలు పూర్తవుతాయన్నది ప్రభుత్వాలు తీసుకునే చొరవపై ఆధారపడివుంటుంది.

  • Loading...

More Telugu News