: మీ దగ్గర అధికారం ఉంది, పోలీసులున్నారు, ఉపఎన్నికలే రిఫరెండం... రెడీయా?: చంద్రబాబుకు జగన్ సవాల్
తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్దామని, ఆ ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్ జగన్ వెల్లడించారు. ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా? అని చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. ఎన్నారైలతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నది చంద్రబాబేనని గుర్తు చేసిన ఆయన, పోలీసులు, డబ్బు వారి దగ్గరుందని, అయినా ప్రజల మద్దతు ఎవరికో తేల్చుకుందామని అన్నారు. ప్రశ్నించే విపక్షం లేకుండా చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని, విలువలతో కూడిన రాజకీయాలను ఆయన ఎన్నడో వదిలేశారని నిప్పులు చెరిగారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న చంద్రబాబుకు, ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.