: వారం రోజులుగా జాడలేని సూర్యుడు.. నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన


వారం రోజులుగా సూర్యుడి అడ్రస్ గల్లంతయింది. వరుణుడి దాటికి భానుడు ముఖం చాటేశాడు. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలహీన పడి విదర్భకు చేరిందని, దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కాగా రాత్రి కూడా హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News